2024 Promise Song | IFJ ~ BACM | © 2024 Pst.T.Jafanya Sastry
Pst.T.Jafanya Sastry Pst.T.Jafanya Sastry
80.5K subscribers
338,798 views
7.2K

 Published On Premiered Jan 1, 2024

Copyright @Pst.T.JafanyaSastry 2024.


2024 కొరకు ప్రభువు మనకిచ్చిన వాగ్ధానం
.. తప్పించుకొనిన శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును- యెషయా 37:31
—————————————————- వాగ్ధాన గీతం

ఆగదు నా పయనం - సీయోను చేరకుండా
ఆశలు కోరికలు - వెనకకు లాగిననూ
నా గమ్యము చేర(గ)- సాగిపోయెదనూ

ఎల్షద్దాయ్ బలమియ్యగా
మరి లోతుగా వేరు తన్నెదను/
మరి క్రిందికి వేరు తన్నెదను

అదొనాయ్ తోడుండగా
పైకెదిగీ ఫలియించెదన్

1) ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
శ్రేష్ట స్థలమున లోతుగా నాటి
సంద్రము వరకు వ్యాపింపజేసి
కొండలే ఎక్కించినావే

నీ చేతి కొమ్మనూ
నీ నీడలో కాయుమా ॥ ఎల్షద్దాయ్ ॥

2) గుండె కడవను పాలతో నింపి
ఎముకల్లోనా మూలుగు పెంచి
ఎత్తైన కొండ ఎక్కే బలమును
కృపతో నాకిచ్చావే

నీ చేతి భోజనమే
ఈ శక్తి నాకిచ్చెనూ ॥ ఎల్షద్దాయ్॥

3) ఎగిరే రెక్కలు నాకిచ్చినా
నీదు గాయల్లో దాగుందునూ
సింహాన్నే చంపే బలమిచ్చినా
నీ చాటునే బ్రతికెదనూ

బలమూ నీదే కదా
కృపయూ నీదే కదా


Copyright @Pst.T.JafanyaSastry 2024.

show more

Share/Embed