దాటివెళ్లిపోకయా పరిశుద్ధాత్ముడా|DAATIVELLIPOKAYAA|TIMOTHI|IMPACT MINISTRIES|NEW JESUS SONGS 2024
IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
100K subscribers
999 views
35

 Published On Sep 29, 2024

దాటి వెళ్లిపోకయ్య పరిశుద్దత్ముడా
నన్ను దాటివెళ్ళిపోకయ్య పరిశుద్దత్ముడా (2)
నేను బలహీనడను తండ్రి
నన్ను బలపరచు పరిశుద్దత్ముడా (2)
నా బాల్య పాపములను
యవ్వన అతిక్రమములు
జ్ఞాపకం చేసుకోకయ్య
నీ కృపను బట్టి నన్ను
నీ దయ చొప్పున నన్ను
జ్ఞాపకంలో ఉంచుకోవయ్య (2)

1. వ్యర్థమైన మాటలు నోట రాకుండా
వ్యర్థమైన తలంపులు మదిలో లేకుండా
అపవిత్రమైన పెదవులు నావి
వాటిని అగ్నితో కాల్చివేయుమా (2)
నాకు సత్యము బోధించు సర్వసత్యములో నడుపు
నా పెదవులకు స్తుతి నేర్పుమయ్య (2)
అభిషేకించయ్యా పరిశుద్దత్ముడా
నన్ను అభిషేకించయ్యా పరిశుద్దత్ముడా (4)

2. వ్యర్థమైన వాటిని చూడకుండా
వ్యర్థముగా కాలక్షేపం చేయకుండా
నీ మార్గములో నడుచుకొనుటకు
నా కన్నులను త్రిప్పివేయుము (2)
నా కన్నులకు తండ్రి కనిపెట్టుట నేర్పించు
దేవోక్తి చేత కన్నులు తెరువు (2)
అభిషేకించయ్యా పరిశుద్దత్ముడా
నన్ను అభిషేకించయ్యా పరిశుద్దత్ముడా (4)

3. సడలిన చేతులను బలపరుచుమయ్య
తొట్రిల్లు మోకాళ్ళును దృఢపరచుమయ్య (2)
అన్యభాషాలతో అభిషేకించి
ప్రార్థనాత్మతో నింపుము తండ్రి (2)
నాకు ప్రార్ధన నేర్పించు రోధన నేర్పించు
అంగలార్చుట నేర్పించు యేసయ్య (2)
అభిషేకించయ్యా పరిశుద్దత్ముడా
నన్ను అభిషేకించయ్య పరిశుద్దత్ముడా (4)

show more

Share/Embed